Telangana rains: వరద నీటిలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు

Telangana, Hyderabad, Rains, భారీ వ‌ర్షాలు, Heavy rains,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Hyderabad Rains: తెలంగాణ‌లో వాన‌లు దంచికొడుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట‌మునిగాయి. భారీగా వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలోనే వరద నీటిలో నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.

వివ‌రాల్లోకెళ్తే.. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎడ‌తెరిపి లేకుండా వాన‌ కురుస్తుండ‌టంతో భారీగా వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలోనే బాచుపల్లిలోని ప్రగతినగర్ లో నాలాలో ప‌డి నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. ఎన్ఆర్ఐ కాలనీకి చెందిన మిథున్ అనే బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా జారి నాలాలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో ర‌క్షించ‌లేక‌పోయారు.

సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెరువు సమీపంలోని నాలాలో చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహం ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ, డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Related Post