17 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నలుగురు యువకుల అరెస్టు

rape, murder, Dalit sisters, Lakhimpur Kheri, Uttar Pradesh, police, అత్యాచారం, హత్య, దళిత సోదరీమణులు, లఖింపూర్ ఖేరీ, ఉత్తరప్రదేశ్, పోలీసులు,

ద‌ర్వాజ‌-గౌహ‌తి

Guwahati: అసోంలో మ‌రో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. దిబ్రూఘర్ పట్టణానికి చెందిన 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న నలుగురిని అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణం తర్వాత సోమవారం ఉదయం నిందితులను అరెస్ట్ చేశారు.

బనీపూర్ ధేకేరీ గావ్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. ఆదివారం రాత్రి బనీపూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో బాలిక మృతదేహం వేలాడుతూ కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్సాం మెడికల్ కాలేజీకి తరలించారు.

Related Post