దర్వాజ-సిద్దిపేట
Narendra Modi’s 73rd Birthday: నేతలపై తమ అభిమానాన్ని చాటుకోవడం సహజం. అందులో ప్రధాని మోడీ క్రేజ్ మామూలుగా ఉండదు. కాగా.. వినూత్నమైన ఆలోచనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల కేంద్రానికి చెందిన సాదుల నరేందర్ ఒకరు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన నరేందర్ క్రమక్రమంగా ప్రధాని మోడీ విధానాల ముగ్ధుడై వీరాభిమానిగా మారాడు.
వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్ అయిన నరేందర్ .. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా.. తన కెమెరాలతో పీఎం అని రూపొందించారు. ఇలా వినూత్న రీతిలో ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు.