దర్వాజ-హైదరాబాద్
Telangana Congress: తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ ‘విజయభేరి’ బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయే.. ఈ గొప్ప రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావంలో నేను, నా సహచరులతో కలిసి భాగమయ్యే అవకాశం లభించింది. ఇప్పుడు దాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని అన్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను సోనియా గాంధీ ప్రకటించారు.
1) మహాలక్ష్మి:
- మహిళలకు ప్రతీ నెల ₹2500.
- కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్.
- ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.
2) రైతు భరోసా:
- ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ₹15,000.
- ₹12,000 వ్యవసాయ కూలీలకు.
- వరి పంటకు 500 బోనస్.
3) గృహ జ్యోతి:
- ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
4) ఇందిరమ్మ ఇళ్లు:
- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.
- ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.
5) యువ వికాసం:
- విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు.
- ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
6) చేయూత:
- వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.
- పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా.