Chandrababu: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరాహార దీక్షలు

TDP, Chandrababu Naidu, AP govt, crimes , women, Disha Act , Y. S. Jagan Mohan Reddy, టీడీపీ, చంద్ర‌బాబు నాయుడు, ఏపీ ప్ర‌భుత్వం, మ‌హిళ‌లు, దిశా చ‌ట్టం, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి,

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి

Chandrababu arrest: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేప‌థ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

చంద్ర‌బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ మాజీ మేయర్, తెలుగు మహిళా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుంకర పావనితో పాటు అనేక మంది మహిళలు కాకినాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కాకినాడలోని బాలాజీ చెరువు వద్ద మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి మోసాలకు పాల్పడలేదనీ, కానీ రాష్ట్ర అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.

జనసేన నేత ముత్తా శశిధర్ శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. టీడీపీ రిలే నిరాహార దీక్షా శిబిరాలను జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ సందర్శించి మద్దతు తెలిపారు. ఈ అరెస్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారనీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రకటించారు.

Related Post