అంగల్లు కేసులో చంద్ర‌బాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వు

Chandrababu Naidu

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి

TDP leaders Jala Deeksha: అంగళ్లు అల్ల‌ర్ల కేసులో టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగియగా, పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, ప్రాసిక్యూషన్ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగల్లు ప్రాంతంలో జరిగిన అల్లర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఈ నెల 22న ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం విచారణను 26వ తేదీకి (మంగళవారం) వాయిదా వేసింది. నేడు ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత ధర్మాసనం పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అనే పరిణామం టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ కు కారణమవుతోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో అంగల్లులో హింస చెలరేగింది. ఉద్రిక్తతలను పెంచినందుకు చంద్రబాబుతో పాటు టీడీపీ క్యాడర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలావుండ‌గా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కస్టడీ పిటిషన్ తో పాటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది.

Related Post