దర్వాజ-హైదరాబాద్
TSPSC-Telangana High Court: టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ విధానం ఎందుకు వాడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాల్లోకెళ్తే.. TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది. దీన్ని పట్టించుకోనందుకు ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకప్పుడు పేపర్ లీకేజీ, ఇప్పుడు బయోమెట్రిక్ సమస్య? ఎందుకు వస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే కోర్టు విచారణను 2.30కి వాయిదా వేసింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు టీఎస్ పీఎస్సీ విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని కోర్టు మరోసారి ప్రశ్నించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.