దర్వాజ-హైదరాబాద్
Telangana High Court: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు రూ.10000 వేల జరిమానా విధించడంతో పాటు అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ కేసులో సందర్భంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకెళ్తే.. ఆలేరు ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయిన హైకోర్టు రూ.10000వేల జరిమానా విధించి అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
2018 ఎన్నికల సమయంలో గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డిని చేర్చారు. ఆస్తులను సరిగా చూపించలేదని, సునీత ఎన్నిక చెల్లదంటూ సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను మంగళవారం విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేకు జరిమానా విధించిన కోర్టు కేసు విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
