- గట్టమ్మ ఆలయంలోకి కూడా అనుమతి ఉండదు
- కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్ల సూచన
మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని రేపటినుంచి మూసివేయనున్నారు. ఎండోమెంట్ సిబ్బందికి కరోనా పాజిటీవ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి చర్యలను తీసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం(మార్చి 1) నుంచి మార్చి 21వరకు ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వెళ్లాలనుకుంటే ఈ సమయంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని ఆఫీసర్లు తెలుపుతున్నారు.
అలాగే గట్టమ్మ ఆలయంలోకి కూడా భక్తులకు ప్రవేశం ఉండదని ఆలయ పూజారుల కమిటీ తేల్చిచెప్పింది. ఈ విషయాలను భక్తులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అలాగే కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.
దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్
రామప్పలో మేడారం భక్తుల తాకిడి
