Breaking
Tue. Nov 18th, 2025

ఆర్య వైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చెయ్యాలే !

uppala venkatesh demands corporation for Arya Vysya at arya vysya sangam meeting in bn reddy nagar
uppala venkatesh demands corporation for Arya Vysya at arya vysya sangam meeting in bn reddy nagar
  • త‌ల‌కొండప‌ల్లి జ‌ట్పీటీసీ ఉప్ప‌ల వెంక‌టేష్

ద‌ర్వాజ‌-రంగారెడ్డి:

ఎస్పీ, ఎస్టీ, బీసీ కార్పొరేష‌న్ల మాదిరిగా ఆర్య వైశ్యుల కోసం ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయాల‌నీ, ఈ ఆర్థిక ఏడాదిలోనే దానికి బ‌డ్జెట్ కేటాయించి, వారికి ఆర్థిక స‌హ‌కారాన్ని అందించాల‌ని ఉప్ప‌ల చారిట‌బుల్ ట్ర‌స్ట్ చైర్మెన్, త‌ల‌కొండ‌ప‌ల్లి జ‌ట్పీటీసీ ఉప్ప‌ల వెంక‌టేష్ అన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుబ‌డిని వైశ్య కుటుంబాలు చాలా ఉన్నాయ‌నీ, వారికి ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించాల‌ని కోరారు.

అలాగే, వైశ్యులంటే నీతికి నిజాయితీకి మారుపేరు.. వైశ్యులంటే సేవా స‌హ‌కారాని మారుపేరు అని ఉప్ప‌ల వెంక‌టేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్యులంద‌రూ ఐక్యం కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలిపారు. ఆదివారం హైద‌రాబాద్-బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌లోని బొబ్బిలి దామోద‌ర్ రెడ్డి గార్డెన్‌లో రంగా రెడ్డి ఆర్య‌వైశ్య మ‌హాస‌భ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వంలో ఆయ‌న పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల వెంక‌టేష్ మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త, గౌరవ శ్రీ ఎమ్మెల్సీ బొజ్జ దయానంద్ గుప్త , ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త , షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, లక్ష్మీనారాయణ గుప్త త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

ప్రశ్నించే గొంతునే గెలిపించాలి

రామ‌ప్పలో మేడారం భ‌క్తుల తాకిడి

ప్రేమంటే సంపేసుడేనా ?

సమ్మక్క సారలమ్మల కథ!

Related Post