దర్వాజ-హైదరాబాద్
India vs Netherlands: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా నేదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ రాణించింది. నలుగురు ప్లేయర్లు ఆఫ్ సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ మరో ఆఫ్ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో కోహ్లీ తన ఏడో 50+ స్కోరును సాధించాడు. మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ.. సెంచరీ చేస్తాడని భావించినప్పటికీ, 51 పరుగుల వద్ద వెంటనే ఔటయ్యాడు. కోహ్లీ ఈ బంతిని పూర్తిగా మిస్ కావడంతో అది ఆఫ్ స్టంప్ పైభాగాన్ని తాకింది.
తన ఇన్నింగ్స్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ప్రపంచ కప్ లో ఎక్కువ ఆఫ్ సెంచరీలు చేసిన సచిన్, షకీబ్ అల్ హసన్ రికార్డులను కోహ్లీ సమం చేశాడు.
ఒకే ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక 50+ స్కోర్లు
7 – సచిన్ టెండూల్కర్ (2003)
7 – షకీబ్ అల్ హసన్ (2019)
7 – విరాట్ కోహ్లీ (2023)*
అలాగే, వన్డే వరల్డ్ కప్ లలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన జాబితాలో సెకండ్ ప్లేస్ కోహ్లీ కొనసాగుతున్నాడు.
వన్డే వరల్డ్ కప్ లలో అత్యధిక 50+ స్కోర్లు చేసింది వీరే..
21 – సచిన్ టెండూల్కర్ (44)
14 – విరాట్ కోహ్లీ (35)
13 – రోహిత్ శర్మ (26 ఇన్నింగ్స్)*
13 – షకీబ్ అల్ హసన్ (36)
12 – కుమార సంగక్కర (35)