దర్వాజ-హైదరాబాద్
Telangana Assembly Elections 2023:తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. అయితే, ఇంకా చాలా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
పోలింగ్ గడువు ముగిసినప్పటికీ.. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో నిలిచిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.