దర్వాజ-క్రికెట్
Rohit Sharma dance : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో టీమిండియా భారత గడ్డపై అడుగుపెట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచిన భారత టీమ్ గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ప్రపంచ ఛాంపియన్ జట్టుకు దేశ రాజధానిలో ఘనంగా స్వాగతం లభించింది. ఢిల్లీ విమానాశ్రయంలో రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని అభిమానులకు ప్రదర్శించారు.
ఆ తర్వాత భారత జట్టు సభ్యులు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చేరుకుంది. అయితే, అక్కడ ఏర్పాటు చేసిన బ్యాండ్, పంజాబీ భాంగ్రాకు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
