Loading Now
Mohammed Shami-Sania Mirza

Shami-Sania : సానియా మీర్జాతో పెళ్లిపై స్పందించిన ష‌మీ..

దర్వాజ-హైదరాబాద్

Shami-Sania : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన మాజీ భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్నారు. జనవరి 2024లో పాకిస్థానీ నటి సనా జావేద్‌తో మాలిక్ తన వివాహం గురించి ప్రకటించడంతో ఇది జరిగింది. ఈ షాకింగ్ ప్రకటన కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రేమలో సానియా మీర్జా అంటూ కథనాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీతో త్వరలోనే వివాహం జరగనుందని సోషల్ మీడియాలో కథనలు వైరల్ అయ్యాయి.

ఈ క్ర‌మంలోనే సానియా మీర్జాతో తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్టార్ పేస‌ర్ మహ్మద్ షమీ స్పందించాడు. భారత టెన్నిస్ సంచలనంతో తన పెళ్లికి సంబంధించిన ఈ వార్తలను కొట్టిపారేసిన షమీ.. ఇలాంటి పచ్చి అబద్ధాలను వ్యాప్తి చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. సోషల్ మీడియాలో త‌న ఫొటోల‌తో మీమ్స్ చేస్తున్న వారు బాధ్యతగా వ్యవహరించాలని హిత‌వుపాలికారు. “సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయవద్దని నేను కోరుతున్నాను” అని షమీ వెల్ల‌డించారు.

అలాగే, సోషల్ మీడియాలో అబద్ధాలు పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని మహమ్మద్ షమీ అన్నాడు. జ‌రిగే పర్యవసానాలను తెలుసుకోకుండా నెటిజ‌న్లు పిచ్చి సరదా కోసం ఇలాంటి పనులు చేస్తారని మండిప‌డ్డారు. త‌న ఫొటోల‌ను మార్పింగ్ చేయ‌డం, మీమ్స్ చేయ‌డం అనేది ఒక‌రి జీవితాల‌కు సంబంధించిన విష‌యాల‌నీ, వినోదం కోసం మీమ్స్ చేసినా.. ఇలాంటి అబద్ధాలు పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ష‌మీ అన్నారు.

అలాగే, ఇలాంటి చెత్త ప‌నులు చేయ‌కుండా జీవితంలో ఏదైనా సాధించ‌డానికి త‌మ శ‌క్తిని ఉప‌యోగించాల‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఎవ‌రినైనా గుంత‌లోకి తోయ‌డం సుల‌భంగానే ఉంటుంద‌ని పేర్కొన్న ష‌మీ.. వేరే వాళ్ల జీవితాల‌ను స‌మ‌స్య‌ల్లోకి నెట్ట‌కుండా మీ జీవితంలో ఏదైనా సాధించండి అని త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేసిన వారిపై అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ స్థాయిని పెంచుకునే ప‌నులు చేయండి.. ఒక మంచి వ్య‌క్తిగా ఉండండి అని త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేసిన వారికి త‌న మాట‌ల‌తో బుద్ది చేప్పే ప్ర‌య‌త్నం చేశారు ష‌మీ.

Share this content:

You May Have Missed