Breaking
Wed. Dec 4th, 2024

Amazon Forest : అమెజాన్ అడవులు లేకుంటే ఈ ప్రపంచం ఉండదా? అమెజాన్ అడవుల కథ ఇది

Image by a href=httpspixabay.comusersestevesbae-8123618utm_source=link-attribution&utm_medium=referral&utm_campaign=image&utm_content=3228741Raimundo Teixeira estevesbaea from a href=httpspixabay.comutm_sou

దర్వాజ-హైదరాబాద్

Unique Features of the Amazon Rainforest : అమెజాన్ అడవుల కథ ఇది. అమెజాన్ అడవులు లేకుంటే ఈ భూమి మీద మనుగడ ఇలా ఉండేది కాదని పరిశోధకులు చెబుతున్నారు. అమెజాన్ అడవులు, ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విస్తృతమైన వర్షారణ్యాలు. దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు బ్రెజిల్, పెరూ, కొలంబియా, వెనిజులా, ఈక్వడార్, బొలివియా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా దేశాలలో విస్తరించి ఉన్నాయి. అమెజాన్ అడవులు దాదాపు 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.

rainforest Amazon Forest : అమెజాన్ అడవులు లేకుంటే ఈ ప్రపంచం ఉండదా? అమెజాన్ అడవుల కథ ఇది

అమెజాన్ అడవులు ఎందుకు అంత ముఖ్యం?

అమెజాన్ అడవుల ప్రాముఖ్యత : భూమి మీద జీవుల మనుగడకు ఆక్సిజన్ అవసరం. అమెజాన్ అడవులు ప్రపంచానికి 20% ఆక్సిజన్‌ను అందిస్తాయి, అందుకే వీటిని “ప్రపంచ ఊపిరితిత్తులు” అని పిలుస్తారు. ఈ అడవులు అనేక రకాల జీవజాతులకు నివాసంగా ఉన్నాయి. ఇక్కడ సుమారు 40,000 రకాల మొక్కలు, 1,300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 2.5 మిలియన్ రకాల కీటకాలు ఉన్నాయి.

mountains Amazon Forest : అమెజాన్ అడవులు లేకుంటే ఈ ప్రపంచం ఉండదా? అమెజాన్ అడవుల కథ ఇది

అమెజాన్ అడవులు ఎందుకు అంత ప్రత్యేకం?

అమెజాన్ అడవుల ప్రత్యేకతలు: అమెజాన్ అడవులు చాలా దట్టంగా ఉంటాయి. ఇక్కడ సూర్యరశ్మి కేవలం 2% మాత్రమే నేల మీద పడుతుంది. వర్షం పడినప్పుడు నీరు నేల మీద చేరడానికి దాదాపు పది నిమిషాల సమయం పడుతుంది. ఈ అడవులలో అనేక రకాల ప్రమాదకరమైన జీవులు నివసిస్తాయి. వీటిలో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే ఫిరానా చేపలు, విష కప్పలు, జాగ్వార్లు, విషపూరితమైన పాములు ఉన్నాయి.

macaws Amazon Forest : అమెజాన్ అడవులు లేకుంటే ఈ ప్రపంచం ఉండదా? అమెజాన్ అడవుల కథ ఇది

ప్రపంచంలో అతిపెద్ద రెండవ నది అమెజాన్ లోనే ఉంది

అమెజాన్ నది: అమెజాన్ నది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది. ఈ నది పశ్చిమ నుండి తూర్పుకి ప్రవహిస్తుంది. 2007లో మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి ఈ నదిని పూర్తిగా ఈత కొట్టాడు. మార్టిన్ ఈ నదిని ఈదడానికి 66 రోజులు పట్టింది.

waterfalls Amazon Forest : అమెజాన్ అడవులు లేకుంటే ఈ ప్రపంచం ఉండదా? అమెజాన్ అడవుల కథ ఇది

ప్రమాదంలో అమెజాన్ అడవులు

అమెజాన్ అడవుల సమస్యలు : ఇటీవల, అమెజాన్ అడవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వనరుల అతి వినియోగం, అగ్నిప్రమాదాలు, వాతావరణ మార్పులు ఈ అడవులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు 20% అమెజాన్ అడవులు నరికి వేయబడ్డాయి. ఇది ఇలాగే కొనసాగితే అనేక జీవజాతులతో పాటు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Share this content:

Related Post