Darvaaja – Hyderabad
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హైదరాబాద్ మహా నగర మహాసభలు డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగాయి. ఈ మహాసభలలో హైదరాబాద్ మహానగరంలోని ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ, సామజిక సమస్యల పైన పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం ఏబీవీబీ మహానగర అధ్యక్షురాలు డాక్టర్ మాళవిక నూతన నగర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గంలో కొందుర్గ్ గ్రామానికి చెందిన జగ్గమొల్ల నందినికి హైదరాబాద్ మహానగర సంయుక్త కార్యదర్శిగా స్థానం కల్పించారు. ప్రస్తుతం నందిని హైదరాబాద్ లోని KMIT కళాశాలలో చదువుతున్నారు. గతంలో ఏబీవీపీ విధ్యానగర్ ఉపాద్యక్షురాలుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా పనిచేశారు.
నందిని మాట్లాడుతూ.. ‘జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజం నిర్మాణం అవుతుంది అనే ఆలోచనతో ఏబీవీపీ పని చేస్తుంది. రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు విద్యారంగ సమస్యలపైన అనునిత్యం స్పందిస్తూ సమాజంలో జరుగుతున్న సమస్యల పరిష్కారం దిశగా.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పనిచేస్తోందని’ తెలిపారు. తనపై నమ్మకంతో ఏబీవీపీ హైదరాబాద్ నగర కార్యవర్గంలో చోటు కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
Share this content: