Darvaaja – Siddipet
Aghori in Komuravelli: కొంత కాలంగా తన వివాద్పద వైఖరితో నడుచుకుంటున్న అఘోరి మరోసారి వివాదాస్పద వైఖరీతో వార్తల్లో నిలిచారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద అఘోరి పలువురిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ వైరల్ గా మారాయి.
అఘోరి రాకతో భారీగా భక్తుల రాకతో..
సిద్దిపేటలోని కొమురవెల్లి మల్లన్న ఆలయంలో దగ్గరకు మహిళా అఘోరి స్వామివారి దర్శనం కోసం వచ్చారు. అయితే, నగ్నంగా ఆలయంలోకి రావద్దనీ, బట్టలు ధరించి రావాలని ఆలయ అధికారులు చెప్పారు. దీంతో అఘోరి ఆగ్రహానికి గురయ్యారు. అంతకుముందే అఘోరి చూడటానికి భారీగా జనం ఆలయం వద్దకు చేరారు. ఆగ్రహంతో ఉన్న అఘోరి తన వెంట తెచ్చుకున్న కత్తితో అక్కడున్న జనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
మహిళా అఘోరి అరెస్ట్
భక్తులపై దాడి చేస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తుండటంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అఘోరిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. మహిళా అఘోరిపై మర్డర్ అంటెప్ట్ కేసు తో పాటు పబ్లిక్ లో న్యూసెన్స్ సృష్టించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సమాచారం. గతంతో ఈ మహిళా అఘోరి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా అనుమతించకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.
భక్తులపై మహిళా అఘోరి దాడి !
— mahe (@mahe950) January 28, 2025
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద మహిళా అఘోరి భక్తులపై దాడి చేశారు. మల్లన్న దర్శనం కోసం దుస్తులు ధరించి ఆలయంలోకి రావాలని అధికారులు సూచించారు. దీంతో అగ్రహించి అక్కడున్న పలువురిపై దాడి చేశారు.#Aghori #Komuravelli #Mallanna #Siddipet pic.twitter.com/66ghweSk3V