Breaking
Thu. Jun 26th, 2025

SRH IPL 2025: దెబ్బకొట్టిన వర్షం.. ఐపీఎల్ 2025 నుండి సన్‌రైజర్స్ హైదరాబాదు ఔట్ !

Sun Risers Hyderabad (Photo Credit: X/ SunRisers Hyderabad

దర్వాజ -హైదరబాద్

IPL 2025 SRH: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు ప్రయాణం వర్షం తడిసిపోవడంతో ముగిసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలవాల్సిన మ్యాచ్ వర్షం దెబ్బతో రద్దు అయింది. ప్లేఆఫ్ అవకాశాల కోసం పోరాడుతున్న SRHకి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ల తరువాత ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా అవుట్ అయిన మూడో జట్టుగా హైదరాబాద్ టీమ్ నిలిచింది.

ఈ మ్యాచ్ టాస్ గెలిచిన SRH కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకుని అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు. మ్యాచ్ తొలి బంతికే కరుణ్ నాయర్‌ను ఔట్ చేసి SRHకి శుభారంభాన్ని అందించాడు. ఇషాన్ కిషన్ అద్భుత క్యాచ్‌ పట్టాడు. ఆపై ఫాఫ్ డుప్లెసిస్‌ను, అభిషేక్ పోరెల్‌ను వరుసగా ఔట్ చేసిన కమ్మిన్స్ బౌలింగ్‌లో దుమ్ము రేపాడు.

ఇషాన్ కిషన్ వరుసగా నాలుగు క్యాచ్‌లు పట్టి IPL చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో టాప్ ఫోర్ బ్యాట్స్‌మెన్‌ అందరూ వికెట్ కీపర్ క్యాచ్‌గా ఔట్ కావడం ఇదే మొదటిసారి.

ప్యాట్ కమ్మిన్స్ తర్వాత హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌లు కూడా విజృంభించడంతో ఢిల్లీ జట్టు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, విప్రాజ్ నిగమ్, ట్రిస్టన్ స్టబ్‌ల భాగస్వామ్యం ఢిల్లీ జట్టు 50 పరుగుల మార్కును దాటింది. అలాగే, అశుతోష్ శర్మ జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, ఈశాన్ మలింగా బౌలింగ్ లో భారీ షాట్లతో 28 బంతుల్లో 41 పరుగులు చేసి ఢిల్లీ స్కోరును 133 పరుగులకు తీసుకెళ్లాడు.

హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్ కు దిగే సమయంలో వర్షం మొదలైంది. భారీగా కురవడం ప్రారంభమైంది. గ్రౌండ్ పూర్తిగా నీటితో నిండిపోయింది. మ్యాచ్ జరిగే సరిస్థితి లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

దీంతో హైదరాబాద్ టీమ్ కు కేవలం ఒకే పాయింట్ దక్కగా, ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయింది. అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది.


సంక్షిప్త స్కోరు:

ఢిల్లీ క్యాపిటల్స్: 133/7 (20 ఓవర్లు)
(అశుతోష్ శర్మ 41, ట్రిస్టన్ స్టబ్ 41; ప్యాట్ కమ్మిన్స్ 3-19, జయదేవ్ ఉనాద్కట్ 1-13)
సన్‌రైజర్స్ హైదరాబాదు: బ్యాటింగ్ చేయలేదు. మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

Related Post