దర్వాజ-ముంబై
Shefali Jariwala: ప్రముఖ బాలీవుడ్ నటి, బిగ్ బాస్ సీజన్ 13 మాజీ కంటెస్టెంట్ షెఫాలి జరీవాలా (Shefali Jariwala) 2025 జూన్ 27 రాత్రి కార్డియాక్ అరెస్ట్‌కు గురై మరణించారు. ఆమె వయసు కేవలం 42 సంవత్సరాలే. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ప్రాణాలు విడిచారని వైద్యులు ప్రకటించారు.
‘కాంటా లగా’తో ఓవర్ నైట్ స్టార్‌గా Shefali Jariwala ఎదిగారు
షెఫాలి జరీవాలా తన కెరీర్‌ను 20 ఏళ్ల వయసులో ‘కాంటా లగా’ రీమిక్స్ మ్యూజిక్ వీడియోతో ప్రారంభించారు. ఈ పాట ఆమెను రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మార్చింది. “కాంటా లగా గర్ల్” అనే బిరుదుతో ఆమె గుర్తింపు పొందారు. అక్కడి నుంచే స్టార్ డమ్ మొదలైంది.

పాట విజయవంతమైనా Shefali Jariwala ఎందుకు కెరీర్‌ను కొనసాగించలేదు?
ఈ ప్రశ్నకు జవాబు షెఫాలే ఇచ్చారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “15 ఏళ్ల వయసులోనే నాకు మిరుగుపాటి (ఎపిలెప్సీ) ప్రారంభమైంది. చదువులో ఒత్తిడి, ఆందోళన కారణంగా ఇది తీవ్రతరంగా మారింది” అని చెప్పారు. ఈ వ్యాధి కారణంగా ఆమెకు తరచూ పట్టు వచ్చేది, వేదికలపై, క్లాసులలో, బహిరంగంగా కూడా ఇది దెబ్బతీసిందని వెల్లడించారు.
Shefali Jariwala ఆత్మవిశ్వాసం కోల్పోయిన బాధ
“నాకు ఎప్పుడైనా పట్టు వచ్చేయొచ్చు అనే భయం ఉండేది. అందుకే నేనెప్పుడూ పెద్దగా ప్రాజెక్టులు తీసుకోలేకపోయాను. ఇది నాకు 15 సంవత్సరాల పాటు జరిగింది” అని షెఫాలి చెప్పిన మాటలు ఇండస్ట్రీలో ఇప్పటికీ చర్చగా ఉన్నాయి.

చిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి Shefali Jariwala
‘కాంటా లగా’ తర్వాత షెఫాలి, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో నటించిన ముఝ్‌సే షాది కరోగి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత బిగ్ బాస్ 13లో కూడా పాల్గొన్నారు. ఆమె పర్సనాలిటీ అభిమానులను ఆకట్టుకుంది.
శోకసంద్రంలో Shefali Jariwala కుటుంబం
షెఫాలి భర్త పరాగ్ త్యాగీ ఆసుపత్రి బయట బాధతో కనిపించారు. షెఫాలీ తల్లి కన్నీరుతో విలపించారు. నటి మృతితో బాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
Actress @shefalijariwala gives us a glimpse of her day as she attended a promotional event recently and we can’t get over her glam look. We just love how Shefali manages so slay it in every look so effortlessly 😍#ShefaliJariwala #Actress #Glam #Fashion #Stunning pic.twitter.com/ugMd4VXqjY
— Urban Asian (@UrbanAsian) January 30, 2024