Breaking
Sat. Jun 28th, 2025

Shefali Jariwala: ఓవర్ నైట్ స్టార్ నుంచి విషాదం వరకు.. బాలీవుడ్ స్టార్ షెఫాలి జరీవాలా ప్రయాణం ఇది

shefali jariwala
shefali jariwala

దర్వాజ-ముంబై

Shefali Jariwala journey: ప్రముఖ నటి, డ్యాన్సర్ షెఫాలీ జరీవాలా 42 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆమె శుక్రవారం రాత్రి అనారోగ్యం కారణంగా ముంబైలోని మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మరణించినట్టు హాస్పిటల్ రిసెప్షనిస్టు తెలిపారు. ఇప్పటి వరకు ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు, కానీ గుండెపోటే కారణమై ఉండవచ్చని సమాచారం.

shefali-jariwala-1-1024x768 Shefali Jariwala: ఓవర్ నైట్ స్టార్ నుంచి విషాదం వరకు.. బాలీవుడ్ స్టార్ షెఫాలి జరీవాలా ప్రయాణం ఇది
shefali jariwala

‘కాంటా లగా’ గర్ల్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన Shefali Jariwala

షెఫాలీ జరీవాలా 2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆమె బోల్డ్ లుక్, డ్యాన్స్ స్టెప్స్ ఆమెను ఓవర్ నైట్‌స్టార్‌గా నిలిపాయి. అప్పటి నుంచి ఆమెను ప్రజలు ‘కాంటా లగా గర్ల్’గా పిలుస్తున్నారు.

రియాలిటీ టీవీ షోలు, బాలీవుడ్ పాత్రలు పోషించిన Shefali Jariwala  

అంతేకాకుండా, షెఫాలీ బిగ్‌బాస్ 13లో పాల్గొని మరింత ప్రజాదరణ పొందారు. ఆమె తన భర్త పారాగ్ త్యాగీతో కలిసి ‘నచ్ బలియే’లో కూడా కనిపించారు. ఆమె ‘బూగీ వూగీ’ వంటి షోలలో పాల్గొనడం ద్వారా టెలివిజన్ ప్రేక్షకులను అలరించారు.

shefali-jariwala-2-1024x768 Shefali Jariwala: ఓవర్ నైట్ స్టార్ నుంచి విషాదం వరకు.. బాలీవుడ్ స్టార్ షెఫాలి జరీవాలా ప్రయాణం ఇది
shefali jariwala

‘ముఝ్‌సే షాదీ కరోగీ’లో బాలీవుడ్ కెమెరాలో తళుక్కుమన్న Shefali Jariwala

2004లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన ‘ముఝ్‌సే షాదీ కరోగీ’ చిత్రంలో షెఫాలీ చిన్న పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇది ఆమె బాలీవుడ్ ప్రయాణంలో చిన్నదైనా.. ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది.

shefali-jariwala-5-1024x768 Shefali Jariwala: ఓవర్ నైట్ స్టార్ నుంచి విషాదం వరకు.. బాలీవుడ్ స్టార్ షెఫాలి జరీవాలా ప్రయాణం ఇది
shefali jariwala

కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Shefali Jariwala

షెఫాలీ 2011లో కన్నడ చిత్రం ‘హుదుగారు’లో నటించారు. ఇది తమిళ చిత్రం ‘నాడోడిగల్’కు రీమేక్. ఈ చిత్రాన్ని కె. మాదేశ్ దర్శకత్వం వహించారు. ఇందులో పునీత్ రాజ్‌కుమార్, శ్రీనగర్ కిట్టి, యోగేశ్, రాధికా పండిట్ నటించారు.

Shefali Jariwala  చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు

మరణానికి మూడు రోజులు ముందు షెఫాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోషూట్ పోస్ట్ చేశారు. ఆమె ఒక గ్రే కలర్ జంప్‌సూట్‌లో కనిపించారు. “Bling it on baby!” అని రాసిన ఆమె క్యాప్షన్ ఇప్పుడు అభిమానులను బాధకు గురి చేస్తోంది.

Shefali Jariwala మరణంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి

ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే పలువురు నటులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేశారు. అభిమానులు ఆమె ఫొటోలు, పాత వీడియోలు షేర్ చేస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు.

షెఫాలీ జరీవాలా ఆకస్మిక మృతి భారతీయ ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది.

Related Post