Breaking
Tue. Nov 18th, 2025

Thailand Cambodia border conflict : 1100 ఏళ్ల పురాతన శివాలయం కోసం థాయిలాండ్-కంబోడియా ఫైట్.. ఏం జ‌రుగుతోంది?

Preah Vihear temple: Thailand vs Cambodia
Preah Vihear temple: Thailand vs Cambodia

దర్వాజ – అంతర్జాతీయం

Thailand Cambodia border conflict : థాయిలాండ్-కంబోడియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రపంచం ఇప్పటికే వివిధ సరిహద్దు వివాదాలతో అశాంతిగా మారిన వేళ, ఆగ్నేయాసియాలోని రెండు బౌద్ధ దేశాలైన థాయిలాండ్, కంబోడియా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి.

ఈసారి వివాదానికి కేంద్రబిందువుగా 1,100 ఏళ్లనాటి ప్రసాత్ ప్రీహ్ విహార్ శివాలయం నిలిచింది. ఈ సరిహద్దు ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు, అంతేకాక 100,000 మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

థాయిలాండ్-కంబోడియా వివాదం ఎందుకొచ్చింది?

ప్రసాత్ ప్రీహ్ విహార్ ఆలయం డాంగ్రెక్ పర్వతాలపై ఉంది. ఇది కంబోడియా ప్రావిన్స్‌లోని ప్రీహ్ విహార్, థాయిలాండ్ సిసాకెట్ ప్రావిన్స్ మధ్య వాస్తవికంగా గల ప్రాంతం. 1907లో ఫ్రెంచ్ వలస పాలకులు రూపొందించిన మ్యాప్ ఆధారంగా ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని అక్కడి ప్రభుత్వం వాదిస్తోంది. కానీ థాయిలాండ్ మాత్రం ఆ మ్యాప్ అనుమానాస్పదమనీ, తమ ఆధిపత్యాన్ని సమర్థించుకుంటోంది.

అంతర్జాతీయ న్యాయస్థానం తేల్చినా సమస్య పరిష్కారం కాలేదు

1962లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) తీర్పు ప్రకారం ఆలయం కంబోడియాకు చెందుతుందని ప్రకటించింది. కానీ ఆలయ చుట్టూ ఉన్న భూభాగంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 2008లో ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడంతో పరిస్థితి మరింత ఉధృతమైంది. 2011లో పెద్ద ఎత్తున సైనిక ఘర్షణలు జరిగాయి. 2013లో ICJ తిరిగి కంబోడియా పక్షాన తీర్పు ఇచ్చినా థాయిలాండ్ దానిని అంగీకరించలేదు.

భారతదేశంతో ప్రత్యేక సంబంధం క‌లిగిన ప్రసాత్ ప్రీహ్ విహార్ ఆలయం

ప్రాచీన ఖైమర్ సామ్రాజ్యంలో నిర్మితమైన ప్రసాత్ ప్రీహ్ విహార్ ఆలయం 11వ శతాబ్దానికి చెందినది. రాజులు సూర్యవర్మన్ I, సూర్యవర్మన్ II ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్క‌డ శివుడు కోలువై ఉన్నాడు. భారతదేశానికి ఇది ప్రత్యేకమైన మతపరమైన విలువ కలిగిన స్థలంగా ఉండటమే కాక, 2018లో కంబోడియా ఈ ఆలయ పునరుద్ధరణకు భారత్‌ను సహకారం కోరింది.

Related Post