దర్వాజ – హైదరాబాద్
హైలెట్స్
- 2025 జులై 30న కెమ్చట్కా సముద్ర తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపంతో సునామీ సంభవించింది
- రష్యా, జపాన్, అమెరికా, లాటిన్ అమెరికా సహా పసిఫిక్ దేశాల్లో భారీ సునామి అలలు ఏర్పడ్డాయి
- రష్యాలో 4-5 మీటర్లు సునామి, జపాన్ తీరంలో 0.4-1.3 మీటర్లు అలలు ఏర్పడ్డాయి
2025 కెమ్చట్కా భూకంపంతో ప్రపంచ దేశాలపై సునామీ ప్రభావం
2025 జులై 30న రష్యాలోని కెమ్చట్కా ద్వీప తీరానికి సుమారు 125-136 కిమీ దూరంలో 8.8 తీవ్రతతో సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. ఇది సునామీకి కారణం అయింది. ఈ భూకంపం సముద్రంలో సుమారు 19-21 కిలోమీటర్ల లోతులో జరిగింది. ఈ ప్రకంపనలు పసిఫిక్ సముద్రంలో భారీ సునామి అలలు ఉత్పత్తి చేశాయి. ఈ సునామి ప్రభావం పలు దేశాలలో ఉలిక్కిపడేలా చేశాయి. సునామీ హెచ్చరికలు, ఇళ్లు ఖాళీ చేయించటం వంటి చర్యలకు దారితీసింది.
రష్యా (కెమ్చట్కా, కురిల్ దీవులు)
కురిల్ దీవుల దగ్గర సెవీరో-కురిల్స్ ప్రాంతంలో 4-5 మీటర్ల సునామి అలలు తీరప్రాంతాన్ని తాకాయి. పోర్టులు, చేపల ప్రాసెసింగ్ ప్లాంట్ వరుసగా వరదకు గురయ్యాయి. చాలా మంది గాయపడ్డారు. పేట్రోపావ్లోవ్స్క్-కెమ్చట్స్కీలోని ఒక కిండర్గార్టెన్ గోడ కూలిపోయింది, కానీ ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర పరిస్థితుల్లో కురిల్ దీవుల్లో సుమారు 2,700 మందిని ఇళ్లు ఖాళీ చేయించి రక్షించారు.

జపాన్
జపాన్ వాతావరణ సంస్థ తూర్పు తీరాలకు (హోక్కైడో నుంచి వకాయామా వరకు) 3 మీటర్ల సునామి హెచ్చరికలు జారీ చేసింది. 220 కంటే ఎక్కువ మునిసిపాలిటీల్లో సుమారు 2 మిలియన్ల మందిని తరలించారు. ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్ర సిబ్బంది కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, అక్కడ నమోదైన అలల ఎత్తు 0.4 నుండి 1.3 మీటర్ల మధ్యే (కుజి పోర్ట్ వద్ద) నమోదైంది.
అమెరికా & పసిఫిక్ దీవులు
అమెరికా పశ్చిమ తీరాలు (క్యాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్), అలాస్కా, హవాయిలో సునామి హెచ్చరికలు జారీ చేశారు. హవాయిలో అలలు 1.7-1.8 మీటర్ల ఎత్తు వరకు వచ్చాయి. దీంతో తీర ప్రాంతాలు, పోర్టులు, విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. పెద్ద నష్టం జరగలేదు. ఉత్తర క్యాలిఫోర్నియా తీరంలో 1.1 మీటర్ల అలలు నమోదయ్యాయి. అల్యూషియన్స్ ద్వీపాలు సహా పసిఫిక్ ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు చేశారు.
లాటిన్ అమెరికా, ఇతర పసిఫిక్ దేశాలు
చిలీ, ఎక్విడార్, పెరూ, కొస్టా రికా, దక్షిణ అమెరికా కొన్ని ప్రాంతాలలో 3-4 మీటర్ల వరకూ సునామి అలలు రావడంతో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫ్రెంచ్ పోలినేసియాలో మార్కెసాస్ దీవుల్లో 1.5 మీటర్ల అలలు నమోదు అయ్యాయి. సోలోమన్, పాపువా న్యూగినియా, వనాటూ, ఫిజీ, నౌరూ, ఎక్వడార్, మెక్సికో వంటి పసిఫిక్ దేశాల్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు.

సునామీ ప్రభావం 2025
| ప్రాంతం | సునామి ఎత్తు | ప్రభావాలు |
|---|---|---|
| రష్యా (కురిల్ దీవులు) | 4-5 మీటర్లు | పోర్టులు వరదపాటు, చిన్న గాయాలు, ఎమర్జెన్సీ ప్రకటించారు |
| జపాన్ (తూర్పు తీరాలు) | 0.4-1.3 మీటర్లు | సుమారు 2 మిలియన్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తక్కువ నష్టం జరిగింది |
| హవాయి | 1.7-1.8 మీటర్లు | తరలింపులు, విమానాశ్రయాలు, పోర్టులు తాత్కాలిక మూసివేత |
| US పశ్చిమ తీరాలు | సుమారు 1.1 మీటర్లు | హెచ్చరికలు, తీరప్రాంతాల మూసివేత |
| లాటిన్ అమెరికా & పసిఫిక్ | 1-4 మీటర్లు (వేరువేరు) | హెచ్చరికలు, తరలింపులు, తక్కువ నష్టం |
ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావాలు
రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం 1900 తర్వాత ప్రపంచంలో ఆరు అత్యంత బలమైన భూకంపాల్లో ఒకటిగా నిలిచింది. 1952 తర్వాత కెమ్చట్కా ప్రాంతంలో ఇది అత్యంత శక్తివంతమైన భూకంపం. దీని తక్కువ లోతు, సబ్డక్షన్ జోన్ కారణంగా పసిఫిక్ ప్రాంతాల్లో భారీ సునామి అలలు వచ్చాయి. గ్లోబల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టం చాలా తగ్గింది. అయితే, కెమ్చట్కా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావాలు ఉండవచ్చని భావిస్తున్నారు. జపాన్ అణు కేంద్రాలు కూడా అప్రమత్తతగా తాత్కాలికంగా నిలిపివేశారు.
2025 కెమ్చట్కా భూకంపం, సునామి పసిఫిక్ ప్రాంతం సీస్మిక్ ప్రమాదాలకు మళ్లీ గుర్తు చేసింది. సునామి అలలు దూరం పెరిగి కొద్దిగా తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సమన్వయమైన జాగ్రత్తల వల్ల పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, త్వరగా చర్యలు తీసుకోవడంతో కొంత ప్రమాదాన్ని నివారించారు. ప్రిపేర్డ్నెస్ ముఖ్యమైన పాఠాలు ఈ సంఘటన అందించింది.
