దర్వాజ – హైదరాబాద్
BSNL Super Recharge Plan: బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇటీవల తన సేవలను మరింత బలోపేతం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్, వీఐ తమ టారీఫ్ ధరలను పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ మాత్రం ధరలను స్థిరంగా ఉంచింది. దీనివల్ల చాలామంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. 4జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. 5జీ సేవలు త్వరలో రానున్నాయి.
రూ.1,999లో ఏడాది వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ రీఛార్జి ప్లాన్
బీఎస్ఎన్ఎల్ తాజాగా రూ.1,999 రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో 365 రోజుల పాటు సేవలు పొందవచ్చు. దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా కంపెనీ మార్కెట్లో నిలిపింది.
డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ తో బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 1.64 జీబీ హై స్పీడ్ డేటా పొందుతారు. మొత్తం 600 జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏడాది పాటు అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యం, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందిస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఆఫర్ తో బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.1 చెల్లించి 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యం పొందవచ్చు. ఈ ఆఫర్ కొత్తగా సిమ్ కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు ప్రయోజనం
తక్కువ ధరలో ఎక్కువకాలం సేవలు, అన్లిమిటెడ్ కాల్స్, డేటా సదుపాయం కలగడం వల్ల ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఆకర్షణీయంగా మారింది. ప్రత్యేకించి ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.
