దర్వాజ – హైదరాబాద్
హైలెట్స్
- పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో యూఏఈ పై విజయం సాధించింది
- ఇండియా రన్‌రేట్ ఆధారంగా గ్రూప్-Aలో టాప్ లో ఉంది
- శ్రీలంక గ్రూప్-Bలో రెండు విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది
Asia Cup 2025 Points Table : ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ దశ చివరి దశకు చేరుకుంది. పాక్, యూఏఈ జట్ల మధ్య జరిగిన పోరులో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో పాకిస్తాన్ ఈ దశలో రెండు విజయాలు అందుకుని సూపర్ 4 కు చేరుకుంది. భారత్ కూడా రెండు విజయాలు సాధించింది. రన్‌రేట్ కారణంగా గ్రూప్-ఏలో భారత్ టాప్ లో ఉండగా, పాక్ రెండో స్థానంలోనే ఉంది. ఇండియా రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది.
సెప్టెంబర్ 19న అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఇండియా–ఒమన్ మధ్య చివరి గ్రూప్-A మ్యాచ్ జరగనుంది.
పాకిస్తాన్ vs యూఏఈ మ్యాచ్ వివరాలు
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 146 పరుగులు చేసింది. తరువాత బౌలర్లు రాణించడంతో యూఏఈ ని 105 పరుగులకే పాకిస్తాన్ కట్టడి చేసింది. దీంతో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
ఇది పాకిస్తాన్‌కు మూడు మ్యాచ్‌ల్లో రెండో విజయం. అయినప్పటికీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో పాక్ ఇండియాను దాటలేకపోయింది. యూఏఈ ఒక విజయం, రెండు ఓటములతో మూడో స్థానంలో ఉంది. ఒమన్ మాత్రం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
గ్రూప్-Bలో టాప్ లో శ్రీలంక
గ్రూప్-Bలో శ్రీలంక రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించినా, నెట్ రన్‌రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఒక విజయం, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉండగా, హాంగ్‌కాంగ్ వరుస ఓటములతో చివర్లో ఉంది.
సెప్టెంబర్ 18న అబుదాబిలో శ్రీలంక–ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ గ్రూప్-బీ ఫలితాలను నిర్ణయించనుంది.
ఆసియా కప్ 2025 పాయింట్ల పట్టిక
ఆసియా కప్ 2025 గ్రూప్-A
- ఇండియా – 2 విజయాలు, 0 ఓటములు, 4 పాయింట్లు, NRR +4.793
- పాకిస్తాన్ – 2 విజయాలు, 1 ఓటమి, 4 పాయింట్లు, NRR +1.790
- UAE – 1 విజయం, 2 ఓటములు, 2 పాయింట్లు, NRR -1.984
- ఒమన్ – 0 విజయాలు, 2 ఓటములు, 0 పాయింట్లు, NRR -3.375
ఆసియా కప్ 2025 గ్రూప్-B
- శ్రీలంక – 2 విజయాలు, 0 ఓటములు, 4 పాయింట్లు, NRR +1.546
- బంగ్లాదేశ్ – 2 విజయాలు, 1 ఓటమి, 4 పాయింట్లు, NRR -0.270
- ఆఫ్ఘనిస్తాన్ – 1 విజయం, 1 ఓటమి, 2 పాయింట్లు, NRR +2.150
- హాంగ్‌కాంగ్ – 0 విజయాలు, 3 ఓటములు, 0 పాయింట్లు, NRR -2.151
