Breaking
Tue. Nov 18th, 2025
labour bricks
labour bricks

తరతరాలుగా పేద గుండెల జీవనం
గిట్టుబాటు విలువకు నోచుకోలేదు
శ్రమదేహ దారుల్లో కన్నీరు ప్రవహిస్తోంది
దుమ్ము, ధూళీ బతుకులని గాలికొదిలేశాం
యాంత్రిక పరుగుల మాయలో
కాంక్రీట్ జన సమూహాలు
కోరికల సౌధాల్ని పెనవేసుకున్నవి
భౌతిక సుఖ లాలసలో
ఇరుకు తనపు ఆర్భాటాల నడుమ
తలబిరుసుతో బుద్ధి జీవినని మురిసి
అన్నీ గెలుస్తూ జగజ్జేతనవుతున్నాననే
నా పగటి కలను ఛిద్రం చేసి
మేధను వెక్కిరిస్తూ
పాప పరిహారమో, కనిపించని శత్రువొకటి
గుణపాఠం చెబుతున్నది
పోగొట్టుకున్న చోటే వెతుక్కోమని
నిర్వీర్యమైన శక్తి స్థాయిలు
పునరుజ్జీవాన్ని కలవరిస్తున్నాయి
ఇప్పుడు తలదించుకొని
ఆకుపచ్చని అవకాశాల పాదుల కోసం
తలమునకలవుతున్నా..
శ్రమజీవన సౌందర్యాన్ని
ప్రగతి దారుల నిలిపేందుకు
దిక్సూచిగా విశ్వ వికాస కవితను
హృదయ పత్రంపై లిఖిస్తున్నా…

lachhireddy శ్రమ దేవోభవ

వనిపాకల లచ్చిరెడ్డి, ఉపాధ్యాయుడు

నల్గొండ(టౌన్)

vlr.vanipakala@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

ప్రేమంటే సంపేసుడేనా ?

అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?

మ‌నం మారేదెప్పుడు ?

ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

Related Post