Loading Now
ACB arrests TSSPDCL officer

2 లక్షల జీతం కానీ.. 30 వేలకు కక్కుర్తిప‌డి.. చివ‌ర‌కు..?

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
ACB arrests TSSPDCL officer : అక్షరాల రూ. 2 లక్షల జీతం వస్తుంది. అయినా 30 వేల రూపాయలకు కక్కుర్తి పడ్డాడు. చివరికి అవినీతి అధికారైన అసిస్టెంట్ ఏడీఈ.. అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయాడు. ఈ ఘటన శుక్రవారం నాడు హైదరాబాద్ లో గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ డివిజన్ లో జరిగింది. ఈ ఘటనపై డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చరణ్ సింగ్ గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ డివిజన్ లో ఏడీఈ గా పనిచేస్తున్నాడు.

ఇతడు శంకర్ పల్లి, ఇబ్రహీంబాగ్, మొయినాబాద్, నార్సింగ్ డివిజన్లలో జరిగే పనులన్నింటినీ పర్యవేక్షిస్తుంటారు. అయితే ఇందులో మణికొండకు ప్రాంతానికి చెందిన రవి గుత్తేదారుగా ఈ శాఖలో చిన్న చిన్న పనులను చేస్తుండేవారు. అయితే ఈ మధ్యనే అతను మణికొండలో విద్యుత్ తీగలను ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చే టెండరును పొందాడు. దానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని ఇవ్వాలని కోరగా ఏడీఈ లంచం కోరాడు.

దాంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. అధికారుల సూచనల మేరకు.. శుక్రవారం నాడు ఆ గుత్తేదారు చరణ్ సింగ్ అడిగిన రూ. 30 వేలు ఇవ్వగా అతను తీసుకుంటున్న సమయంలోనే అనిశా అధికారులు పట్టుకుని.. జైలుకు తరలించామని డీఎస్పీ వెల్లడించారు.

Madras High Cour: ప్ర‌జా ప్ర‌యోజ‌నం కోస‌మా? మెరుగైన న్యాయ నిర్వ‌హ‌ణ కోస‌మా?

Terrorist Attack : మ‌ణిపూర్‌లో భ‌ద్ర‌తా కాన్వాయ్ పై ఉగ్ర‌దాడి

Night Time Eating: అర్థరాత్రి తినే అలవాటు మీకుందా? అయితే ఈ ఫుడ్ మాత్రమే తీసుకోండి..

Crime: ఎంతటి అమానుషం.. సంతానం కోసం 16 నెలలుగా యువతిని బంధించి..

Air Pollution: కాలుష్యం.. ప్ర‌పంచంలోనే టాప్‌లో ఢిల్లీ

Tulsi Gowda: అడవి తల్లి బిడ్డకు దక్కిన ‘పద్మం’.. ఆమె కథేంటీ?

Share this content:

You May Have Missed