Loading Now
crime

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

దర్వాజ-వెంకటాపురం

Crime News:పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేసాడనే నెపంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు దండకారాణ్యంలో మావోయిస్టులు ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కె.కొండాపుర నివాసి మాజీ సర్పంచి కొర్స రమేష్(33)ను మావోయిస్టులు రెండు రోజుల కిందట అపహరించారు. ఆ తర్వాత రమేష్ ను చంపి.. డెడ్ బాడీని జిల్లా సరిహద్దు ప్రధాన మార్గానికి 8 కి.మీ దూరంలో ఉన్న ఛత్తీస్ గఢ్ స్టేట్ కొత్తపల్లి శివారులోని ఇన్నర్ రోడ్డుపై వేసారు. దాంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంత కాలం నుంచి కొర్స రమేష్ ఏటూరునాగారంలో నివాసముంటున్నాడు. కాగా అతను ఈ నెల 20 వ తేదీన.. వెంకటాపురం మండలం తిప్పాపురానికి చెందిన తన స్నేహితుడు కుర్సం రమేష్ తో కలిసి తన బైక్ పై భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల నుంచి ఛత్తీస్ గఢ్ రాష్ట్రం భీమారం కు బయలుదేరారు. గుర్తు తెలియని వ్యక్తులు రమేష్ దగ్గరకొచ్చి తనతో మాట్లాడాలని పిలిస్తే వెళ్లానని తన భార్యకు చెప్పాడు.

ఇక అక్కడే రమేష్ ను అతని స్నేహితుడిని మావోయిస్టులు అపహరించి అడవుల్లోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తీసుకెళ్లిన ప్రాంతంలోనే బుధవారం నాడు రమేష్ డెడ్ బాడీ ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే కొర్స రమేష్ నోట్లో తుపాకీ పెట్టి కాల్చి చంపినట్టు అతనిని చూస్తేనే అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. బుధవారం నాడే అతనిని చంపినట్టు రక్తమరకల ఆధారంగా పోలీసులు నిర్దారించారు. అయితే రమేష్ తో వెళ్లిన వ్యక్తిని మాత్రం విడిచిపెట్టారని వెళ్లడించారు. ప్రజాభిప్రాయం తోనే మాజీ సర్పంచ్ రమేష్ ను చంపినట్టు వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో రమేష్ డెడ్ బాడీ వద్ద ఓ లేఖను పెట్టారు. అందులో..‘వెంకటాపురం ఎస్సై జి.తిరుపతి కొర్స రమేష్ ను ఇన్ ఫార్మర్ గా మార్చారు.

ఇక మేం అడిగే సామాగ్రిని రమేష్ తో పంపుతూ అతని సెల్ ఫోన్ లొకేషన్ తో మా కదలికలను గుర్తించే ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలోనే విషం కలిపిన పాలపొడిని పోలీసులు మాకు సరఫరా చేయించారు. దాన్ని తాగిన దళ సభ్యలు అనారోగ్యానికి గురయ్యారు. అందులో మ్యాదరి భిక్షపతి అలియాస్ విజేందర్ అనే మావోయిస్టు అమరుడయ్యారు. మావోయిస్టుల పార్టీకి ద్రోహం చేసి పోలీసుల నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. ప్రజాభిప్రాయం మేరకే అతన్ని చంపుతున్నామని’ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే చేసిన తప్పులను రమేష్ ప్రజాకోర్టులో అంగీకరించాడన్న వాయిస్ రికార్డును వాట్సాప్ లో విడుదల చేశారు మావోయిస్టులు.

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?

Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్

Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..

Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..

Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..

Share this content:

You May Have Missed