Breaking
Tue. Dec 3rd, 2024

Police Thieves: సెలబ్రేషన్స్ కోసం మేకలను దొంగలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తి ఏందయ్యా సామీ..?

goat
goat

దర్వాజ-నేషనల్

Police Thieves: అందరూ న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా చేసుకుంటున్నారు.. మరి మీమేం పాపం చేశాం.. మేము కూడా సుక్క, ముక్క తో బగ్గ ఎంజాయ్ చేయాలని భావించారు ఆ పోలీసులు. అందుకే మందును అయితే ఎలాగోలా తెచ్చుకున్నారు. కానీ మందులోకి ముక్క మాత్రం లేదే. పోలీసుల దగ్గర పైసలు కరువా.. ఎంతైనా కొనుక్కొని తినొచ్చు. అందరిలా కొనుక్కొని తింటే ఏం మజా వస్తది.. మా రూటే సపరేటు అంటూ మేకలను దొంగతనం చేసేందుకు పక్కాగా ప్లాన్ వేశారు ఆ పోలీసులు. ఆ ప్లాన్ ను సక్సెస్ చేసి ఏకంగా రెండు మేకలను దొంగిలించారు.

ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది. సంధికెల గ్రామస్థుడు సంకీర్తగురు మేకలు పెంచుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కాగా శుక్రవారం తన మేకల గుంపులో రెండు మేకలు కనిపించకపోవడంతో.. అందరినీ ఆరా తీసాడు. దాంతో అతనికి అసలు విషయం తెలిసిపోయింది. దాంతో సంకీర్తనగురు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ జరుగుతున్న తంతు చూసి బాధితుడు షాక్ కు గురయ్యాడు. దొంగలించిన మేకలను పోలీసులు కోసేందుకు సిద్దమయ్యారు. దాంతో బాధితుడు తన మేకలను తనకు ఇవ్వమని వేడుకున్నాడు.

మేకలను ఇవ్వకపోగా బాధితుడిని బెదిరించి మరీ అక్కడ నుంచి పంపించేశారు పోలీసులు. దాంతో అతను గ్రామస్థులకు ఆ విషయాన్నిచెప్పి ..వారిని తనతో తీసుకుని వాళ్లపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గకుండా వాళ్లందరినీ మళ్లీ బెదిరించారు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముంది ఈ విషయం నేరుగా జిల్లా ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లడం జరిగింది. ఎస్పీ విచారణ జరిపించి శనివారం నాడు ఏఎస్ఐ సుమన్ మల్లిక్ ను సస్పెండ్ చేశారు.

Liquor Sales: మందు బాబులా మజాకా.. ఒక్క 5 రోజుల్లోనే ఇన్ని కోట్లు తాగేసారా..!

Deepthi Shanmukh Breakup: ఐపోయింది అంతా అయిపోయింది.. అనుకున్నట్టే దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసిందిగా..

Pushpa Deleted Scene: పుష్ప సీన్ అదిరిపోలా.. మరెండుకు తీసేస్నారబ్బా..!

TS News : ‘తెలంగాణలో నేరాలు పెరిగినయ్’

Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!

Share this content:

Related Post