Breaking
Tue. Nov 18th, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

shamshabad airport drugs seized #darvaaja
shamshabad airport drugs seized #darvaaja


దర్వాజ-హైద‌రాబాద్

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ పట్టుబడ్డాయి. జాంబియాకు చెందిన మహిళ దోహా నుంచి శంషాబాద్‌కు వచ్చింది. అనుమానాస్పదంగా కనిపించిన ఆమెను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి.

ఆమె నుంచి 8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీని మొత్తం విలువ రూ. 53 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. జాంబియాకు చెందిన నిందితురాలి పేరు ముకుంబా కరోల్‌ అని తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Post