Loading Now
income tax job notification

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు

155 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

income tax job notification: ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. తాజాగా ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 155 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ఎంటీఎస్‌, ట్యాక్స్‌ అసిస్టెంట్‌, ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆగస్టు 25 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా స్ట్పోర్ట్స్ కోటా కింద‌ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 155
ఎంటీఎస్‌- 64
ట్యాక్స్‌ అసిస్టెంట్‌- 83
ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌- 8

అర్హ‌త‌లు, ఎంపిక విధ‌నం త‌దిత‌ర వివ‌రాల‌కు సంబంధిత వెబ్ సైట్ ను చూడ‌వ‌చ్చు.

Share this content:

You May Have Missed