దర్వాజ-సినిమా
Acharya’s Bhale Bhale Banjara Song: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాలోని “భలే భలే బంజారా” అనే పాట విడుదలైంది. ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానులు.. తండ్రీకొడుకులు కలిసి డ్యాన్స్ కు మైమరచిపోతున్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ అందించగా.. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ లు కలిపి పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. చిరంజీవి తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో సాంగ్‌ను షేర్ చేస్తూ ‘నాకు గుర్తుండిపోయే పాట❤️’ అంటూ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రోమో విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో 16 గంటల్లో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలను పొందగలిగింది.
A memorable song for me ♥️
— Acharya (@KChiruTweets) April 18, 2022
Happy to tap my feet with my energetic @AlwaysRamCharan for #BhaleBhaleBanjara.
Hope I dominated him with my grace 😎
▶️ https://t.co/k3PmmUFkQt#AcharyaOnApr29#SivaKoratala #ManiSharma @NavinNooli @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/yWGdXmZVBq
భారీ అంచనాలున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో నిర్మాతలు ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేయడంలో ముందుకు సాగుతున్నట్టు తెలిసింది. ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23వ తేదీన విజయవాడలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిసింది. కొరటాల శివ దర్శకత్వంతో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించారు. ప్రధాన పాత్రలలో సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, సౌరవ్ లోకేష్లు నటించారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Share this content: