Breaking
Sun. Jun 29th, 2025

Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత

madavilatha
madavilatha

దర్వాజ-సినిమా

Pushpa Item Song: డీ గ్లామర్ రోల్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన కలిసి నటిస్తున్న పుష్ప మూవీపై సినీ ప్రేక్షకులకు అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సమంత తన కెరీర్ లోనే తొలి సారిగా ఐటం సాంగ్ చేసింది. ‘ఊ అంటావా మావా.. ఉ ఉ అంటావా మావా’ అంటూ సాగే మత్తులొలికించే ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డులు క్రియేట్ చేసింది. ఈ పాటను ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ పాడింది.

samantha-song-pushpa Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత

ఈ పాటకు లిరిక్స్ ను చంద్రబోస్ ఇచ్చారు. మత్తు మత్తుగా సాగే ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక పాట సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక అదే తరహాలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి ఈ పాటకు. ఇందులో లిరిక్స్ పూర్తిగా మగవారిని కామాందులుగా చూపించారంటూ.. వెంటనే ఈ పాటను తొలగించాలని ఏపీ పురుషుల సంఘం కేసు పెట్టి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై నటి మాధవిలత తన ఫేస్ బుక్ లో కామెంట్స్ చేశారు.

‘వాయమ్మో.. పుష్ప మూవీ సాంగ్ మీద కేస్ అంటగా.. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం సాంగ్స్ ఇలానే ఉంటయి. ఇట్లైతే పాటలు లేని మూవీలను చెయ్యలి. అట్లే నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకు కేస్ లు పెడతా.. రారా సామీ పాట మీద.. ఏంటి ఒక అమ్మాయికి మగాడిని చూస్తే, అతను పోలిస్తే అంత చులకనగా వెంట పడి వెళ్లిపోద్దా..? అబ్బాయి నడిచిన చోట భూమి టచ్ చేసి మొక్కుద్దా..? ఒక మహిళ పరువు పోయింది.. ఛా నాకు నచ్చలే .. నేను పెడతా కేస్.. తగ్గేదే లే’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది మాధవిలత

AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

Related Post