దర్వాజ-సినిమా
Akhil Akkineni: ‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు అక్కినేని వారసుడు అఖిల్. కానీ ఈ సినిమా అఖిల్ కు కలిసి రాలేదు. దాంతో ‘హాలో’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. అయినా.. హిట్టు మాత్రం అఖిల్ కు అందని ద్రాక్ష గానే తయారయ్యింది. ముచ్చటగా మూడో సారంటూ.. ‘మిస్టర్ మజ్ను’ గా ఎంట్రీ ఇచ్చాడు. అయినా లాభం లేకపోయింది. అయినా పట్టు విడవని విక్రమార్కుడిలా.. నాలుగో సారి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూవీ అందరి అంచనాలను తలక్రిందులు చేసి సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా.. ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే మాత్రం ఓపిక చాలానే ఉండాలి. అఖిల్ కూడా ఓపికగా హిట్ వచ్చేంతవరకు ఎదురు చూసాడు.. అతడు అన్నకున్నది ఎట్టకేల్లకు సాధించాడు. దాంతో మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదంటూ తెగ కష్టపడిపోతున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సురేందర్ డైరెక్షన్ లో ‘ఏజెంట్’మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్ సీక్రేట్ ఏజెంట్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ పాత్రకోసం అఖిల్ చాలా కష్టపడిపోతున్నాడు. సమయం మరిచి గంటలకు గంటలు జిమ్ లోనే గడుపుతున్నాడు. దానికి తగ్గ ఫలితం వచ్చినట్టుగానే అనిపిస్తోంది. ఎలా అంటారా.. తాజాగా ఈ కుర్ర హీరో కండలు తిరిగిన దేహంతో ఉన్న తన పిక్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇక దానికి ‘తొందరలోనే తుఫాన్ రాబోతుంది.. నాకు ఆ విషయం తెలుస్తుంది’ అంటూ 2022 పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ కు జోడించాడు అఖిల్. ఇక కండలు తిరిగిన దేహాన్ని చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు అఖిల్ పై ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు.
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?
Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి
Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?