దర్వాజ – హైదరాబాద్
Naga Chaitanya Samanta Divorce: నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన నటుడు అక్కినేని నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఇతరుల ప్రైవసీని గౌరవించాలని విమర్శలు గుప్పించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలకు నాగార్జున ఎలా స్పందించారంటే?
నాగార్జున తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో.. “గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని పేర్కొన్నారు.
సమంత-నాగ చైతన్య విడాకులపై కొండా సురేఖ ఏం చెప్పారంటే?
నాగ చైతన్య, సమంత విడిపోవడానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని కొండా సురేఖ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ అలవాటు చేశాడనీ, సమంతను తనకు దగ్గరకు పంపించాలని చెప్పినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలోనే సమంత నో చెప్పడంతో నాగార్జున చైతన్యతో విడాకులు తీసుకోవాలన్నారంటూ కొండా సురేఖ కామెంట్స్ చేశారు.
అలాగే, సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులను కేటీఆర్ ఇబ్బంది పెట్టాడని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్ డ్రగ్స్ వాడాడనీ, రేవ్ పార్టీలు నిర్వహించాడని, నటీనటులను మానిప్యులేట్, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా, వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
Telangana minister #KondaSurekha in a shocking allegation on Wednesday, October 2, stated that #BRS working president #KTR (KT Rama Rao) was the reason behind #Samnatha and #NagaChaitanya’s divorce. pic.twitter.com/i8pwgGYzay
— mahe (@mahe950) October 2, 2024
2021 లో సమంత-నాగ చైతన్య విడాకులు
నాగ చైతన్య-సమంత ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సెలెబ్రేట్ కపుల్. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వారు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే 2021లో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం సమంత సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య కూడా తన సినీ కెరీర్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో నటి శోభితా ధూళిపాళతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది.
Share this content: