Breaking
Tue. Nov 18th, 2025

నితిన్ ‘మాస్ట్రో’ నుంచి ‘బేబీ ఓ బేబీ’ సాంగ్!

Baby O Baby lyrical video from Maestro
Baby O Baby lyrical video from Maestro

ద‌ర్వాజ‌-సినిమా

ఇటీవ‌ల రంగుదే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన హీరో నితిన్.. ఈ ఏడాది కూడా తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ఇప్ప‌టికే ఒకే చెప్పిన ప్రాజెక్టుల‌తో పాటు కొత్త ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్టే దిశ‌గా దూసుకుపోతున్నాడు. దీని కోసం ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయ‌ల‌ని చూస్తున్నారు.

ప్ర‌స్తుతం నితిన్ న‌టిస్తున్న మాస్ట్రో చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. దీనిలో భాగంగానే చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించి ఓ లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేసింది. బేబీ ఓ బేబీ అంటూ విన‌సొంపుగా ఈ సాంగ్ సాగుతోంది. కాగా, ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా న‌భా న‌టేశ్ న‌టిస్తుండ‌గా, మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించారు.

Related Post