దర్వాజ-హైదరాబాద్
Balakrishna with heroine purna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ఎనర్జీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరుపదుల వయస్సులోనూ కుర్రహీరోల జోష్ కు ఏ మాత్రం తగ్గకుండా తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. నటనలోనూ, స్టెప్పుులు వేయడంలోనూ నాకు నేనే సాటి అంటూ తన అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులచే కేరింతలు కొట్టిస్తూనే ఉన్నారు. ఈ నటసింహం ఎక్కడా తగ్గేదే లే అంటూ ఆరుపదుల వయస్సులోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.
ఈ మధ్యే ఈ నటసింహం మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇకపోతే ఎప్పుడూ రియాల్టీ షోలతో ప్రేక్షకులను సందడి చేసే ఓటీటీ ప్లాట్ ఫాంలోకి బాలయ్య బాబు అడుగుపెట్టాడు. సామ్ జామ్ టాక్ షో తో సామ్ ఆహాలో హోస్ట్ గా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక అదే తరహాలో నందమూరి నటసింహం ప్రేక్షకులను తన వాక్ చాతుర్యంతో అబ్బురపరిచేందుకు ‘ సామ్ జామ్ టాక్ షో ’ పేరుతో ఎంట్రీ ఇచ్చారు.
ఫస్ట్ ఎపిసోడ్ లో బాలయ్య మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ తో ముచ్చటించారు. ఇక రెండో ఎపిసోడ్ లో సామ్ జామ్ టాక్ షో వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు. ఇకపోతే దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఈ మధ్యనే విడుదలైంది. ఈ సెకండ్ షో ఫుల్ ఎపిసోడ్ ఈ నెల 12 న స్ట్రీమింగ్ అవనుంది. ఇదిలా ఉంటే తాజాగా అన్ స్టాబబుల్ విత్ ఎన్ బీకే షో పై బాలయ్య బాబు, అందాల రాశి పూర్ణ కలిసి ఫుల్ జోష్ తో ‘నందమూరి నాయక’ పాటపై స్టెప్పులు ఇరగదీశారు. ఎక్కడా తగ్గని ఎనర్జీతో బాలయ్య స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తూ చూసే జనాలను కళ్లు తిప్పుకోకుండా చేశారంటే నమ్మండి.
Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్
Assam Road Accident : త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
T20 World Cup 2021: ఫైనల్కు న్యూజిలాండ్
Malala Yousafzai: వివాహబంధంలోకి మలాలా
IFFI Awards 2021: ఎక్కాడా తగ్గేదే లే అంటున్న సంమంత..
Tamil Nadu Rain: తమిళనాడు భారీ వర్షాలతో 12 మంది మృతి
RRR: రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు’ డ్యాన్స్ అదిరింది!