దర్వాజ-బిగ్ బాస్
Bigg Boss telugu: బిగ్ బాస్ రియాల్టీ షో.. ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ వస్తోంది. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సీజన్ అయిపోయిన వెను వెంటనే మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికి 5 సీజన్లు కంప్లీట్ అయ్యయి. తాజాగా ముగిసిన ఐదవ సీజన్ లో సన్నీ గెలిచాడు. ఇంతకు ముందు సీజన్లలో కూడా అబ్బాయిలే విజేతలవ్వడం గమనార్హం. ఇక పోతే బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను అంతగా మెప్పించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సీజన్ లో కంటెస్టెంట్ల ఆటతీరు గానీ, హోస్ట్ నాగార్జున తీరుపై గానీ ప్రేక్షకులు రకరకాల కామెంట్లు చేశారు. కంటెస్టెంట్ల ఆట తీరు అంతంతగానే ఉంది.
అందులోనూ హోస్టింగ్ కూడా బోరింగ్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. నాగార్జున ఈ సీజన్ తో కలిపి రెండు సార్లు హోస్ట్ గా వ్యవహరించారు. కామెంట్లు, ట్రోల్స్ మధ్యే బిగ్ బాస్ 5 ముగిసింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై తర్వాత సీజన్ రెండు నెలల్లో ప్రారంభం కాబోతుందని నాగార్జున ఇప్పటికే చెప్పకనే చెప్పారు. ఇక సీజన్ 6 లో కంటెస్టెంట్లు ఎవరెవరొస్తున్నారు అనే సంగతి పక్కన పెడితే.. ఈ సీజన్ లో హోస్ట్ గా మాత్రం స్టార్ హీరోను తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
అది ఎవరో కాదు నందమూరి నటసింహం బాలయ్య బాబే నట హోస్ట్ గా వ్యవహరించేది. బాలయ్య ఇప్పటికే ఓటీటీ సంస్థ లోని ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో తో బాలయ్య తన వాక్ చాతుర్యంతో ప్రముఖ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకుల చేత ‘ఆహా’ అనిపిస్తున్నారు. ఈ షోకు టీఆర్పీ రేంటింగ్ పెరిగిపోవడంతో బాలయ్య నే బిగ్ బాస్ షోకు హోస్ట్ గా తీసుకురావాలని నిర్వాహకులు అనుకుంటున్నారని సమాచారం.
Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు
Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?
Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?
Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..
Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..
Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్
Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..
Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..