Bigg boss: బిగ్ బాస్ లీక్.. ఇంటి నుంచి ఈ వారం ఔట్ అయ్యేది..?

దర్వాజ- ఎంటర్ టైన్మెంట్

Bigg boss telugu 5: ఎంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ ఇంటి ముచ్చట్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.. ఆ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్నది అతో లేక మరేదో చూసే జనాలకే తెలియాలి. అందుకే ఇలాంటి షో లను కూడా చూస్తారా.. ఈ షో ఏ ఉద్దేశ్యంతో పెట్టారసలు అనే మాటలు జనాల నుంచి వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్లు వస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే.. బిగ్ బాస్ హౌస్ నుండి ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు.

ఈ ఇంటి నుంచి ఇప్పటి వరకు 9 మంది ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. గతవారమైతే జెస్సీ అనారోగ్యం కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు హౌస్ లో తొమ్మిది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో రవి కెప్టెన్ కావడం వల్ల ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. కాగా శ్రీరామ్, మానస్ లను ఎలిమినేషన్ నుంచి నాగార్జున గారు సేవ్ చేశారు. ఇక మిగిలిన ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, యాని మాస్టర్ ఎలిమినేషన్ లో ఉన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం యాని మాస్టర్ ఎలిమినేట్ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. నామినేషన్స్ లో ఉన్న అందరికంటే యాని మాస్టరే తక్కువ ఓట్లు పొందారట. దాంతోనే ఆమె ఎలిమినేట్ అయ్యిందట. కాజల్ ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూ, ఆమెపై ఫైర్ అవ్వడంతోనే యాని మాస్టర్ ప్రేక్షకుల్లో నెగిటీవ్ ఇమేజ్ ను తెచ్చుకుంది. దాంతోనే యాని మాస్టర్ పై వరస్ట్ అటిట్యూడ్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ వారం ఎలిమినేట్ అయ్యింది యాని మాస్టరే.

Gold: బంగారం కొనే వారికో గుడ్ న్యూస్..

ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..

Papagni River: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్

Healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తేవాల్సిందే..

Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?

CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం

Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

Related Post