Loading Now
naga chaithanya

అవునా.. సమంతను కాకుండా నాగచైతన్య ఆ నటిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా?

దర్వాజ-సినిమా

nagachaithanya: సినీ ఇండస్ట్రీలో పెళ్లిల్లు ఎంత కామనో విడాకులు కూడా అంతే కామన్ అయి పోయాయి. విషయం ఏదైనా కానీయండి.. వన్స్ ఇద్దరి మధ్యలో అండర్ స్టాండిగ్ మిస్ అయ్యిందంటే చాలు డివోర్స్ బాట పడుతున్నారు. ఇదే కోవలో నాగచైతన్య సమంతలు కూడా నడిచారు. ప్రేమ వివాహం చేసుకుని అందరిలో సూపర్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ జర్నీ అని అంతా అనుకునేలోపే ‘మేము విడిపోతున్నాం’ అని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.

వీరిద్దరు విడిపోవడానికి ఇదే కారణమంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ చాలానే వచ్చాయి. సమంత పిల్లల్ని కనడానికి ఒప్పుకోకపోవడం వల్లే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న వార్తలు బాగానే వచ్చాయి. ఇక వీరి విడాకుల తర్వాత చై ఫ్యామిలీ ఫంక్షన్స్, షూటింగుల్లో ఫుల్ బిబీగా ఉన్నా.. సమంత మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. కొంత సమయం తీసుకుని విడాకుల తర్వాత సమంత కూడా సినిమా జోరును పెంచేసింది.

ముఖ్యంగా ట్రెండీ లుక్ తో ఉన్న ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంది. దీనికి తోడు అల్లు అర్జున్ రష్మిక మందాన జంటగా నటిస్తున్న ‘పుష్ప’ మూవీలో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో చిందులు వేసింది. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా చేసింది. మరిన్ని ప్రాజెక్టులు చేస్తోంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే .. సమంతను కాకుండా నాగచైనత్య శృతి హాసన్‌ను ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. అందులో 2013 లో వీళ్లిద్దరూ డేట్ లో ఉన్నారట. కానీ వీళ్ల ప్రేమ పెళ్లి వరకూ వెళ్లలేకపోయిందని సోషల్ మీడియాలో హాట్ టిపిక్ నడుస్తోంది. ఇక ఆ తర్వాత చై సామ్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు.

Share this content:

You May Have Missed