Breaking
Tue. Nov 18th, 2025

Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

Krithi Shetty
Krithi Shetty

దర్వాజ- సినిమా

Krithi Shetty: తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో క్లిక్ అయ్యి పాపులారిటీ, వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారే హీరోయిన్లను వేళ్లపై లెక్కించొచ్చు. కానీ కృతి శెట్టి లక్కు మామూలుగా లేదు. ‘ఉప్పెన’ మూవీతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయమై.. బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. క్యూట్ క్యూట్ లుక్స్ తో అభిమానుల్లో ‘బేబమ్మగా’ ఎన్నటికీ చెరగని ముద్రను వేసుకుంది. ఆ మూవీ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అద్భుత అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

kruthi-1024x768 Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

ఇక తాజాగా ఈ అమ్మడు నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఈ నెల 24 న రిలీజైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘ఈ మూవీలో నా క్యారెక్టర్ కోసం ఇంగ్లీష్ సినిమాలు చూసాను. అలాగే మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకున్నాను. అందులోనూ ఈ మూవీ కోసం నేను స్మోక్ చేశాను. ఇది ఒక పెద్ద ఛాలెంజింగా అనిపించింది. నాకు స్మోక్ అస్సలు నచ్చదు. అందుకే ఈ సీన్ అవసరమా..? ఈ సీన్ ను తీసెయ్యొచ్చు కదా అని దర్శకుడిని అడిగాను.

కానీ తప్పలేదు. మూడు రోజుల పాటు సిగరేట్ కాల్చడం ప్రాక్టీస్ చేశా. ఇక మొదటి రోజు ఫోటో షూటింగ్ రోజు అయితే చేతులు వణికిపోయాయి. ఇక ఈ మూవీలో నేను బోల్డ్ సీన్స్ లో నటించా. బోల్డ్ సీన్స్ అంటే అందరికీ బ్యాడ్ గా అనిపిస్తుంది. కానీ ఏ సీన్ అయినా వృత్తి పరంగానే చేస్తాం. అన్ని సీన్లలాగే ఈ సీన్ కూడా ఉంటుంది. అవసరమైంది కాబట్టే నేను ఈ బోల్డ్ సీన్స్ లో నటించాను. అవసరం లేదనుకుంటే ఆ సీన్స్ లో నేను నటించను. నానీతో సినిమా అంటే మొదట్లో భయంవేసినా.. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు’ అని బేబమ్మ చెప్పుకొచ్చింది.

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

Related Post