Breaking
Tue. Nov 18th, 2025

Golden Globe 2023:ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మక అవార్డు

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, ఆర్ఆర్ఆర్, రాజ‌మౌళి, కీర‌వాణి, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, Golden Globe 2023, RRR, Golden Globe Award, RRR, Rajamouli, Keeravani, Ram Charan, NTR,

దర్వాజ-సినిమా

Golden Globe 2023: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరక్ష‌న్ లో ఏన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) మ‌రో ఘ‌ట‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఆర్ఆర్ఆర్… ‘నాటు నాటు’ చిత్రానికి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2023 (Golden Globe 2023) అవార్డును ఆర్ గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం హాజరై ఎం.ఎం.కీరవాణి ట్రోఫీని అందుకున్న తరువాత ఉప్పొంగిపోయింది… ఈ చిత్రం కూడా ‘నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్’ కేటగిరీలో నామినేట్ చేయబడింది.

వాషింగ్టన్ లో 80వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో సోమవారం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. సంగీత దర్శకుడు MM కీరవాణి స్వరపరిచిన, గాయ‌కులు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లు పాడిన ‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ ట్రాక్‌గా నిలిచింది. ర‌చ‌యిత చంద్ర‌బోస్ ‘నాటు నాటు’ లిర‌క్స్ అందించారు.

Related Post