Breaking
Tue. Nov 18th, 2025

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్.. హరి హర వీర మల్లు డే1 కలెక్షన్లు ఎంత‌?

Hari Hara Veera Mallu box office
PawanKalyan Hari Hara Veera Mallu box office

దర్వాజ – హైదరాబాద్

Hari Hara Veera Mallu box office: జూలై 24న విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ హరి హర వీర మల్లు భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ, తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం, భారత్‌లో తొలి రోజు నెట్ కలెక్షన్ రూ.31.1 కోట్లు కాగా, ప్రీమియర్ షోలు ద్వారా వచ్చిన రూ.12.7 కోట్లు కలిపితే మొత్తం కలెక్షన్ రూ.43.8 కోట్లకు చేరింది.

మొదటి రోజు కలెక్షన్ల రికార్డు.. ప‌వ‌న్ సినిమాలు ఇవే

పవన్ కళ్యాణ్‌ నటించిన చిత్రాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో హరి హర వీర మల్లు టాప్‌లో నిలిచింది.

  1. హరి హర వీర మల్లు – రూ.43.8 కోట్లు
  2. వకీల్ సాబ్ – రూ.40.10 కోట్లు
  3. భీమ్లా నాయక్ – రూ.37.15 కోట్లు
  4. బ్రో – రూ.30.5 కోట్లు

ఈ లెక్కల ప్రకారం ఇది పవన్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్ సినిమాగా తాజా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నిలిచింది.

హరి హర వీర మల్లు పై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్ర‌మ‌ స్పందన

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద హైప్ అమాంతం పెరిగింది. ప్రదర్శనలు 57%కు పైగా ఆక్యుపెన్సీతో నడుస్తుండగా, థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. సినిమా విడుదలైన విజయవాడలో అభిమానులు డాన్స్‌లు చేస్తూ, బాణాసంచా పేల్చుతూ సెలబ్రేషన్స్ జరిపారు. ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాదెల్ తన సమీక్షలో, “పవన్ కల్యాణ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతీ ఫ్రేమ్‌ను ఓనర్‌షిప్ తీసుకుంటారు. యాక్షన్ పార్ట్స్ బాగున్నాయి, కానీ స్క్రిప్ట్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.

హరి హర వీర మల్లు సినిమా విశేషాలు

హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా 1684 కాలపు చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గిస్ ఫఖ్రీ, నోరా ఫతేహి, సునీల్, జిషూ, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

హరి హర వీర మల్లు కలెక్షన్ల జోరు కొన‌సాగేనా?

తొలి రోజు భారీ కలెక్షన్లతో జోరుగా ఆరంభమైన హరి హర వీర మల్లు, వీకెండ్‌లో ఇంకా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశముంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మిశ్ర‌మ టాక్ న‌డుస్తోంది. దీనికి సీక్వెల్ కూడా ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Related Post