Breaking
Sun. Jun 29th, 2025

Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్

manchu laxmi
manchu laxmi

దర్వాజ-సినిమా

Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయ కార్యక్రమాలు తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా అవసరం లేదేమో. ఎందుకంటే.. ఈమె యాక్టర్ గా , యాంకర్ గా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఈ అమ్మడు తన టాలెంట్ తోనే అభిమానుల మనసులను గెలుచుకుంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఈమె ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బుల్లితెరపై తన టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఉంటుంది. అందులోనూ ఈమె చాలా షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈమెపై ఎన్ని విమర్శలు వచ్చినా.. చెల్తా అంటూ లైట్ తీసుకుంటూ తనకు నచ్చింది చేస్తూ వెళుతుంటుంది. అయితే మంచు లక్ష్మి చేసే ట్వీట్స్ మాత్రం ప్రేక్షకులకు ఆసక్తి గొలిపేలా ఉంటాయి. ఈ మధ్యన మంచు లక్ష్మి ఏ ట్వీట్ చేసినా అది తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంచు లక్ష్మి పెట్టిన ఓ ట్వీట్ కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న మంచు లక్ష్మి కొన్ని రోజులు ఫారిన్ టూర్ కు వెళుతున్నానని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించింది. ‘ కుటుంబ సభ్యులతో ఇన్ని రోజులు సరదాగా గడిపాను.

ఇక ఇప్పుడు నా కోసం కొంత సమయాన్ని కేటాయించాలనుకుంటున్నానుు. అందుకు ఒంటరిగా ఒక్కదాన్నే ఫారిన్ టూర్ కు వెళుతున్నాను’ అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ‘ఎయిర్ పోర్ట్ లో ఆకలిగా అనిపించకోయినా లాంజ్ లో తిన్నాను. ఎందుకంటే ఆ టికెట్ కొనడానికి నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది..అందకే ఆ డబ్బులకు న్యాయం చేయాలని ఆకలి వేయకున్నా తిన్నా అంటూ..’ ఫ్లైట్ టికెట్ ధరపై సటైర్ వేసింది మంచు లక్ష్మి. ఇక ఈ పోస్టుకు నెటిజన్లు కామ్ గా ఎలా ఉంటారు.. నీ దగ్గర డబ్బు లేదా..? మీరు షానా రిచ్.. అని కొందరు కామెంట్లు పెడితే.. దానికి మంచు లక్ష్మి ‘తమ్ముడు మా నాన్న రిచ్.. నేను కాదు’ అంటూ రిప్లై ఇచ్చింది.

Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు

Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Related Post