దర్వాజ-సినిమా
Love story release date confirmed : నాగచైతన్య-సాయిపల్లవిలు హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ స్టోరీ చిత్రం విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ సినిమాను వచ్చే నెల 10 (సెప్టెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఇదివరకే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నది.
థియేటర్లు తిరిగి ప్రారంభం కావడంతో వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు మంచి స్పందనను రాబట్టాయి. ఈ చిత్రంపై అంచానాలు సైతం భారీగానే ఉన్నాయి.