దర్వాజ-న్యూఢిల్లీ
పెండ్లి వేడుకలు అనగానే గుర్తొచ్చే విషయాల్లో బ్యాండ్, వాయిద్యాలు, మ్యూజిక్‌కు.. బంధువుల కోలాహలం ముఖ్యంగా సాధారణంగా కనిపిస్తాయి. ఇక వధువరుల ప్రేడ్స్ వస్తే.. వారు చేసే సందడి.. ఆ మజానే వేరుంటది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెండ్లి వేడులకలో వేదికపై కుర్చీలో వధువరులు కూర్చొని ఉండగా.. పెండ్లి కుమారుని స్నేహితుడు ఒక్కసారిగా వేదికపైకి చేరాడు. నాగిని డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు.
ఈ క్రమంలో పెండ్లి కుమారుడ్ని కూడా డ్యాన్స్ చేయమని సైగ చేయగా.. వరుడు నాగస్వరం ఊదుతున్నట్టు యాక్షన్ చేశాడు. మరోవైపు వరుడి పక్కనే ఉన్న వధువు ఇది చూసి తెగ నవ్వుకున్నది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆసక్తికరమై కామెంట్లు వస్తున్న ఈ వీడియో(కింది లింక్ లో ఉంది) మీరు చూసేయండి మరి..!