దర్వాజ-సినిమా
Pushpa Deleted Scene: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్ తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ తాజాగా రిలీజై ఘన విజాయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీలో పుష్ప రాజ్(అల్లు అర్జున్) చెప్పే డైలాగ్స్ వస్తుంటే చూడాలి.. థియేటర్లన్నీ ఈలలతో.. కేకలతో దద్దరిల్లుతున్నాయి. పక్కా మాస్ లుక్ తో కనిపించిన బన్ని క్యారెక్టర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలించింది. ‘తగ్గేదే లే’ అంటూ బన్ని చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరి నోట పలుకుతూనే ఉంది. భారీ అంచనాలతో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.
ఇక పుష్ప రాజ్ గా బన్ని ఒదిగిపోయి అందులో లీనమై ఎంతో ఫర్ఫెక్ట్ గా నటించి.. ప్రేక్షకులను మెప్పించారు. రెండు భాగాలుగా పుష్ప పాన్ ఇండియా సినిమాగా రిలీజై ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మొదటి పార్ట్ యే ఇంత రచ్చ రచ్చ చేస్తే.. సెకండ్ పార్ట్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది. అనుకున్నదానికంటే ఈ మూవీ కలెక్షన్లను, పేరును తీసుకురావడంతో ఈ చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. ఇక ఈ ఆనందంలోనే ఈ చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఇప్పటికే ఊ అంటావా మావా ఉఉ అంటావా మావా పాట ప్రేక్షకులను మత్తులోకి లాగేసింది.
అలాగే తాజాగా దాక్కో.. దాక్కో అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పుష్ప మూవీ డిలేటెడ్ సీన్ ను రిలీజ్ చేసారు. ఈ సీన్ లో పుష్ప రాజ్ ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చకపోవడంతో ఆ వడ్డీవ్యాపారీ అప్పు తీర్చడం లేదని ఇంటి ముందు పెద్ద గొడవ చేస్తాడు. ఆ తర్వాత పుష్ప రాజ్ అప్పుతో పాటుగా వడ్డీ తీర్చి..ఆ వ్యాపారిని కొట్టి అప్పు తీర్చానని అందరికీ చెప్పాలంటూ ఈ వీడియోలో చూపించారు. ఏదేమైనా ఈ సీన్ ను చూసిన ప్రేక్షకులు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ సీన్ గనక డిలీట్ చేయకుండా ఉండుంటే.. థియేటర్లు కేకలతో దద్దరిల్లేవి అంటూ అభిమానులు తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీన్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..
Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!
Samantha: ఏంటీ సమంత వర్కౌట్స్ చేసేది ఇందుకోసమా..?
Corona Bulletin: డౌటే లేదు థర్డ్ వేవ్ మొదలైనట్టుంది.. భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Share this content: