Breaking
Sat. Jun 28th, 2025

pushpa full movie leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్

pushpa
pushpa

దర్వాజ-సినిమా

pushpa full movie leak : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది పుష్ప మూవీ. ఈ సినిమా కోసం ఈ చిత్ర యూనిట్ ఎంతో కష్టపడింది. తమ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుని దాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసారు. అనుకున్నట్టుగానే ‘పుష్ప’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తున్న ఈ మూవీ శుక్రవారమే రిలీజ్ అయ్యింది. కానీ అంతలోనే నెట్టింట్లో ఈ మూవీ లీక్ అయ్యి చిత్ర యూనిట్ ను భారీ షాక్ కు గురిచేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 3000 ల థియేటర్లపైనే రిలీజ్ అయ్యింది.

క్రేజీ కాంబినేషన్ లో తెరక్కిక్కిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక థియేటర్లు అయితే నిండు కుండలా కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ మూవీ చూసిన నటీనటులు కూడా ‘వన్ మ్యాన్ షో’ అంటూ బన్నీని ఆకాశానికెత్తేసారు. దాంతో బన్ని అభిమానులు ఫుల్ దిల్ ఖుష్ అయ్యారు. రికార్డులను తిరగరాసి.. కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని ఈ చిత్ర యూనిట్.. అటు అభిమానులు కూడా భావించారు. ఆ దిశగా ఈ మూవీ అడుగులు కూడా వేయబోయింది. కానీ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా.. బన్ని సినిమాకు కోలుకోని రీతిలో పెద్ద దెబ్బే తగిలింది.

ఎటువంటి తోపు సినిమా అయినా సరే తమ సైట్లలో లీక్ చేసేస్తాయి కొన్ని సైట్లు. అందులో తమిళ్ రాకర్స్ ముందు ప్లేస్ లో ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి కొన్ని సంస్థలు పైరసీకి కేరాఫ్ అడ్రస్ గా మారాయి. రీలీజైన గంటల్లోనే ఆ సినిమాలను తమ సైట్లలో లీక్ చేసేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా ‘పుష్ప’ సినిమాను కూడా ఈ సైట్లు లీక్ చేసాయి. గంటల వ్యవధిలోనే ‘పుష్ప’ మూవీని నెట్టింట్లో పెట్టాయి. ఇంకేముంది ఈ లీకేజీ పుష్ప కలెక్షన్లపై భారీ మొత్తంలో ప్రభావం చూపే ప్రమాదం చాలానే ఉంది. చూడాలి మరి పుష్ప కలెక్షన్లు ఎలా వస్తాయనేది.

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?

Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’

Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?

Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత

AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

Related Post