Breaking
Sun. Jun 29th, 2025

సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

సమంత ఐటెం సాంగ్
సమంత ఐటెం సాంగ్

దర్వాజ-సినిమా
Pushpa Samantha song Controversy: సమంత కెరీర్ లో మొట్ట మొదటి సారిగా పుష్ప సినిమాలో ఐటం సాంగ్ కు స్టెప్పులేసింది. ‘ఊ అంటావా మావా.. ఉఉ అంటావా మావా’ అంటూ సాగే ఈ పాటకు అదిరే రేంజ్ లో రెచ్చిపోయి స్టెప్పులేసి అందరిచేత వాహ్ వా అనిపించింది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఈ పాటదే హవా నడుస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ఈ నెల 17 రిలీజ్ కానుంది.

samantha-Item-song-1024x576 సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీ మొదలు కొని సినీ ప్రేక్షకులందరి చూపు ఈ మూవీ పైనే ఉంది. ఇంకేముంది ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. అంతా బానే ఉందనుకున్న సమయంలో ఈ మూవీలోని సమంత పాటపై ఓ చిక్కు వచ్చిపడ్డది. ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావా అని సాగే పాటపై.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ‘పురుషుల సంఘం’ అసోసియేషన్ కేసు పెట్టింది.

samantha-song-pushpa సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

సమంత చేసిన ఐటం సాంగ్ పూర్తిగా మగవారిని కించపరిచేలా.. అంటే పురుషులను కామాంధులుగా చూపించే ప్రయత్నం చేయడంతోనే వారు కేసు పెట్టినట్టు సమాచారం. ఈ పాటను నిషేధించాలని వారు ఏపీ కోర్టులో డిమాండ్ చేశారు. ఈ పాటలోని పదాలు పురుషులు కామంతో ఉంటారన్న అర్థమే వస్తుందని పురుషుల సంఘం ఆరోపించింది. ఈ కేసుపై కోర్టు తొందరలోనే తీర్పునివ్వనుంది. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడకు దారితీస్తుందో.

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

Related Post