Loading Now
radheshyam movie

ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..

దర్వాజ-సినిమా

Radhe Shyam :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.. ఈ హీరో సినిమా సెట్స్ పైకి వెళితే చాలు మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందోనని డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు కూడా ‘రాధేశ్యామ్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి.

ఇందులో డార్లింగ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుపుతోంది ఈ చిత్ర యూనిట్. ఈ మధ్యనే రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. అందులోనూ ‘ఈ రాతలే’ అనే సాంగ్ ఈ మూవీని చూడాలన్న ఇంట్రెస్ట్ ను మరింత పెంచేసింది. కృష్ణకాంత్‌ రచయతగా ఈ సాంగ్ కు వ్యవహరించారు.

ఇక ఈ పాటపై ఆయన ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. ‘ఈ మూవీ కథ కొందరి పునర్జన్మల స్టోరీ అంటే, మరికొంతమందేమో ట్రైన్ లో జరిగే సినిమా అని రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటనేది వాళ్ల ఊహాగానాలకే వదిలేస్తున్నాను. అయితే నేను రాసిన ఈ సాంగ్ వింటే ఎవరికీ అర్థం కాదు. విజువల్ గా చూస్తే మాత్రం ఎందుకిలా ఈ పాటను రాశానో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పాటతోనే ఈ సినిమా స్టోరీ ఉంటుందని’ ఆయన చెప్పుకొచ్చారు.

Papagni River: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్

Share this content:

You May Have Missed