దర్వాజ-హైదరాబాద్
rrr mass anthem naatu naatu: సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాస్ ఆంథమ్ ‘నాటు నాటు’ సాంగ్ వచ్చేసింది. రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కథానాయకులుగా వస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ (లిరికల్ వీడియో)ను విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు…’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకు ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
కాగా, భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. కథానాయకులుగా ఆలియా భట్, శ్రియ, ఒలివియా మోరిస్,లు నటిస్తున్నారు. సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Gold Prices: బంగారం కొనాలనుకునేవారికో గుడ్ న్యూస్..
Hindi: మాకు హిందీ తెలియదు.. సీఎస్‌ను మార్చండి !
వామ్మో.. టూత్ పేస్ట్ తో పిల్లలకు ఇంత డేంజరా?
Crime : క్షణికావేశం.. తీసింది భర్త ప్రాణం..
వామ్మో నిద్ర పోకపోతే ఇంత పెద్ద సమస్యా?
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న విడుదల
పోషకాహార లోపంలో 33 లక్షల మంది చిన్నారులు